Telangana: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

Revanth Reddy review on telngana economic situation
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ధాన్యం కొనుగోలు, వ్యవసాయంపై సమీక్ష
  • నిన్నటి వరకు ఎన్నికల బిజీలో ముఖ్యమంత్రి 
  • ఎక్కడా తాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ధాన్యం కొనుగోలు, వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు.

నిన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల బిజీలో ఉన్నారు. ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. ఎక్కడా తాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.
Telangana
Revanth Reddy

More Telugu News