AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో ప్రముఖుల నియోజకవ‌ర్గాల్లో పోలింగ్ శాతం ఇలా..!

Polling percentage in popular constituencies in AP Election
  • చంద్ర‌బాబు పోటీ చేసిన కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో 85.87 శాతం పోలింగ్
  • వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోటీ ప‌డిన పులివెందుల‌లో 81.34 శాతం పోలింగ్ న‌మోదు
  • జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌రిలో నిలిచిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 86.36 శాతం ఓటింగ్‌
ఏపీలో ఈసారి భారీగా పోలింగ్ న‌మోదైన విష‌యం తెలిసిందే. బుధ‌వారం సీఈఓ ముకేశ్‌కుమార్ మీనా ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించి రాష్ట్రంలో న‌మోదైన పోలింగ్ వివ‌రాల‌ను వివ‌రించారు. రాష్ట్రంలో మొత్తంగా 81.86 శాతం పోలింగ్‌ నమోదయిన‌ట్లు తెలిపారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్ల‌డించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని మీనా తెలిపారు. 

ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, వైసీపీ అధ్య‌క్షుడు, సీఎం జ‌గ‌న్, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల, నంద‌మూరి బాల‌కృష్ణ వంటి ప్ర‌ముఖులు పోటీ చేసిన వారి వారి నియోజకవ‌ర్గాల్లో ఎంత శాతం పోలింగ్ న‌మోద‌యింద‌నే వివ‌రాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

మాజీ సీఎం చంద్ర‌బాబు పోటీ చేసిన కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో 85.87 శాతం పోలింగ్ న‌మోద‌యింది. ఇక ఏపీ సీఎం  వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోటీ ప‌డిన పులివెందుల‌లో 81.34 శాతం పోలింగ్ న‌మోదైతే, జ‌న‌సేనాని బ‌రిలో నిలిచిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 86.36 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం విశేషం. టీడీపీ యువ‌నేత నారా లోకేశ్ పోటీ చేసిన మంగ‌ళ‌గిరిలో 85.74 శాతం ఓటింగ్ జ‌రిగింది. అలాగే నందమూరి బాలకృష్ణ బ‌రిలో ఉన్న హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 77.82 శాతం పోలింగ్ న‌మోదు కాగా,  ష‌ర్మిల కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన క‌డ‌ప‌లో 78.73 శాతం పోలింగ్ జ‌రిగింది.
AP Elections 2024
Chandrababu
YS Jagan
Pawan Kalyan
Nara Lokesh
YS Sharmila

More Telugu News