Dhulipala Narendra Kumar: స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం భద్రతా సిబ్బంది భేటీ అయ్యారు: ధూళిపాళ్ల నరేంద్ర

CM security met at strong room in Nagarjuna University alleges Dhulipala Narendra
  • నాగార్జున యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సిబ్బంది భేటీ అయ్యారన్న ధూళిపాళ్ల
  • ఈ సమావేశంలో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారని మండిపాటు
  • స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత పెంచాలని డిమాండ్
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లకు చేరాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మరోవైపు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. నిన్న నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం భద్రతా సిబ్బంది భేటీ అయ్యారని ఆయన చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భేటీ కావడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. 

ఈ సమావేశంలో సిద్ధం పోస్టర్ ను కూడా ప్రదర్శించారని ధూళిపాళ్ల మండిపడ్డారు. ఈ భేటీలో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారని చెప్పారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటమి భయంతో వైసీపీ వాళ్లు కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ధూళిపాళ్ల ఫిర్యాదు చేశారు.
Dhulipala Narendra Kumar
Telugudesam
YSRCP
CM Security

More Telugu News