Bharth: అద్దానికీ .. ఆ మాస్క్ కి సంబంధం ఏమిటి? బయపెట్టనున్న 'మిరల్'

Miral Movie Update
  • భరత్ హీరోగా చేసిన 'మిరల్'
  • సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ 
  • ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్ 
  • ఈ నెల 17న విడుదలవుతున్న సినిమా

కోలీవుడ్ లో భరత్ కి మంచి క్రేజ్ ఉంది. 'ప్రేమిస్తే' సినిమా ద్వారా అతను తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఆయన హీరోగా నటించిన 'మిరల్' ఈ నెల 17వ తేదీన థియేటర్లు రానుంది. ఇది సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్. సతీశ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి శక్తివేల్ దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా నుంచి రీసెంటుగా వదిలిన ట్రైలర్, సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. హీరో తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళుతూ ఉండగా, మార్గమధ్యంలో ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటన వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది కథ. 

అద్దంలో చూడకండి సార్ అది వచ్చేస్తుంది .. ఈ వింత మాస్క్ ఎందుకు తీసుకొచ్చారు? అనే మాటలు.. ఈ కథలో ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఉందనే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. థియేటర్స్ లో ఈ సినిమా ఎంతలా భయపెడుతుందనేది చూడాలి. 

  • Loading...

More Telugu News