Ramyakrshna: జోరు తగ్గించిన రమ్యకృష్ణ .. శివగామి ఎఫెక్ట్ అనుకోవాలేమో!

  • గ్లామరస్ హీరోయిన్ గా అలరించిన రమ్యకృష్ణ
  • 'శివగామి' పాత్రతో పెరిగిపోయిన క్రేజ్ 
  • మళ్లీ ఆ స్థాయిలో పడని పాత్రలు
  • ఆమెతో పాటు వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్
Ramyakrishna Special

రమ్యకృష్ణ .. నిన్నటితరం గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే 'బాహుబలి' సినిమాలో ఆమె 'శివగామి' పాత్ర చేశారు. రమ్యకృష్ణ తన కెరియర్లో చేసిన పవర్ ఫుల్ రోల్ ఇది. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ - రానాలకు వచ్చిన క్రేజ్ ఒక ఎత్తు. రమ్యకృష్ణకి వచ్చిన క్రేజ్ ఒక ఎత్తు అనే చెప్పాలి. 

'బాహుబలి' తరువాత 'శివగామి' అనే పాత్ర అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆ తరువాత రమ్యకృష్ణ మరింత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. ఆమె వరుసబెట్టి సినిమాలు చేయకపోయినా, వచ్చిన అవకాశాల్లో తనకి బాగా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేశారు. 'శైలజా రెడ్డి అల్లుడు' .. 'బంగార్రాజు' .. 'రిపబ్లిక్' ..  'రంగమార్తాండ' .. 'గుంటూరు కారం' వంటి సినిమాలు చేశారు. అయితే ఆ పాత్రలేవీ అనుకున్నంతగా పేలలేదు. 

మొదటి రెండు సినిమాల్లో రమ్యకృష్ణ చాలా గ్లామరస్ గా కనిపించారు. మిగతా సినిమాలలో రమ్యకృష్ణ క్రేజ్ కి తగిన స్థాయిలో ఆమె పాత్రను డిజైన్ చేయలేదు. 'రిపబ్లిక్'లో ఆమె పాత్ర పవర్ ఫుల్ గా కనిపించినప్పటికీ, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 'శివగామి' వంటి ఒక రేంజ్ పాత్రలో ఆమెను చూసిన ఆడియన్స్, సాధారణమైన పాత్రలలో ఆమెను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందువల్లనే ఆ స్థాయి రోల్స్ కోసం ఆమె వెయిట్ చేస్తోందని టాక్.

  • Loading...

More Telugu News