Devineni Uma: తాడిప‌త్రిలో వైసీపీ చేసిన మారణహోమానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు: దేవినేని ఉమా

TDP Devineni Uma Maheswara Rao Fire on CM YS Jagan
  • రాష్ట్రంలో ఎన్నిక‌ల త‌ర్వాత నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల‌కు వైసీపీనే కార‌ణ‌మ‌న్న టీడీపీ నేత‌
  • జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమ‌ని జోస్యం
  • ఫ్యాక్షన్ పోకడలని పెంచి పోషిస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ కోరలు పీకి జనం బ్యాలెట్ బాక్స్‌లో పెట్టారన్న దేవినేని  

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 'ఎక్స్' (ట్విట‌ర్) వేదిక‌గా మ‌రోసారి ధ్వ‌జమెత్తారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల త‌ర్వాత నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల‌కు వైసీపీనే కార‌ణ‌మ‌న్నారు. ప్ర‌ధానంగా తాడిప‌త్రిలో వైసీపీ చేసిన మారణహోమానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీ వైపు ప్రజలు నిలబడ్డారని పేర్కొన్నారు. జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. ఫ్యాక్షన్ పోకడలని పెంచి పోషిస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ కోరలు పీకి జనం బ్యాలెట్ బాక్స్‌లో పెట్టారన్నారు.

  • Loading...

More Telugu News