'ఆహా' వేదికపైకి 'షరతులు వర్తిస్తాయి' సినిమా!
- చైతన్యరావు హీరోగా 'షరతులు వర్తిస్తాయి'
- ఆయన సరసన నటించిన భూమి శెట్టి
- మార్చి 15న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి పెద్దగా పబ్లిసిటీ లేదు. అందుకు తగినట్టుగానే, ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. శ్రీలత - సామల నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి, అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 18వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో కథానాయకుడు ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. తన కుటుంబానికి ఆ ఉద్యోగమే ఆధారం. హీరోయిన్ తో అతను రిలేషన్ షిప్ లో ఉంటాడు. తాపీగా జీవితం సాగిపోతుందని అనుకుంటున్న తరుణంలో, మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసం బారిన పడతాడు. అందులో నుంచి ఎలా బయటపడతాడు అనేదే కథ.