Rajanikanth: రజనీ కెరియర్లో ప్రత్యేకం .. 'వేట్టయాన్'!

Vettayan Movie Update
  • రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'వేట్టయాన్'
  • లైకా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 
  • సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్ 
  • అక్టోబర్ లో విడుదల చేసే ఆలోచన

రజనీకాంత్ టైటిల్ పాత్రలో 'జై భీమ్' ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా .. రితికా సింగ్ .. మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రజనీకాంత్ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తిచేయడంతో చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజనీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.

ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే. 'వేట్టయాన్' మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా తప్పకుండా రజనీ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Rajanikanth
Subhaskaran
Gnanavel Raja
Vettayan

More Telugu News