ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అప్పుడు స్పందిస్తా... మా ఏపీ కాంగ్రెస్ గురించీ మాట్లాడుతా: జగ్గారెడ్డి

Jagga Reddy will talk about ap politics on
షార్ట్స్‌లో చూడండి
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనా... అక్కడి మా పార్టీ గురించీ కూడా మాట్లాడుతానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాజకీయాలపై మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు ఏపీ రాజకీయాలపై ప్రశ్నించారు. 

దీనికి ఆయన సమాధానం చెబుతూ.. 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రిజల్ట్స్ వచ్చిన తెల్లారి మాట్లాడుతా. ఎందుకంటే ఫలితాలు వచ్చాక అందరూ సంబరాల్లో ఉంటారు... కాబట్టి ఆ తర్వాత మాట్లాడుతా. అప్పుడు మా ఏపీ కాంగ్రెస్ గురించి మాట్లాడుతాను. గెలిచిన వారి గురించి... ప్రతిపక్ష పార్టీ గురించి... మొత్తం మూడు పార్టీల గురించి మాట్లాడుతాను. ఫలితాలు వచ్చాక... సంబరాలు పూర్తయ్యాక... ప్రమాణ స్వీకారం అయిపోయాక రెండు మూడు రోజుల తర్వాత మాట్లాడుతాను' అన్నారు.
Go Back to Shorts
Jagga Reddy
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News