Pawan Kalyan: ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం: వారణాసిలో పవన్ కల్యాణ్

Pawan Kalyan says its a clean sweep for NDA in AP
  • నేడు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
  • హాజరైన పవన్ కల్యాణ్
  • ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉండడం తన అదృష్టమని వెల్లడి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 

వ్యక్తిగతంగా తాను మోదీని ఎంతో అభిమానిస్తానని, ఆయనంటే తనకు అపారమైన గౌరవం ఉందని పవన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో తమ బంధం కొనసాగుతుందని, మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2014లోనూ తాము కూటమిగా నిలబడ్డామని, ప్రధాని మోదీ మూడోసారి కూడా ప్రధానమంత్రి కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News