Hyderabad Metro: కిక్కిరిసిపోయిన హైదరాబాద్ మెట్రో.. నేడు అదనపు ట్రిప్పులు

Hyderabad metro rail started early today to meet passengers demand
  • ఓటేసేందుకు ఏపీ వెళ్లి తిరిగి వస్తున్న వారితో రద్దీ
  • మెట్రో ప్రాంగణాలు కిటకిట
  • ప్రయాణికుల రద్దీతో నేడు అరగంట ముందే ప్రారంభమైన సేవలు

ఏపీలో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లిన వారు తిరిగి నగరానికి వస్తున్నారు. నిన్న ఓటు వేసిన వెంటనే కొందరు, నేడు మరికొందరు తిరుగుముఖం పట్టారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు దారితీసే రహదారులు కిక్కిరిసిపోయాయి. చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. 

హైదరాబాద్‌ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News