Madhavi Latha: ఒకే మార్గంలో వచ్చిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్, బీజేపీ అభ్యర్థి మాధవీలత.. స్వల్ప ఉద్రిక్తత

Mild tension in Bibi Bazaar where AIMIM and BJP candidate ran into each other
  • హైదరాబాద్‌లోని బీబీ బజార్ ప్రాంతంలో ప్రాంతంలో ఎదురుపడిన అసదుద్దీన్, మాధవీలత
  • మాధవీలతకు వ్యతిరేకంగా మజ్లిస్ కార్యకర్తల నినాదాలు
  • మజ్లిస్ కేడర్‌ను చెదరగొట్టిన పోలీసులు
  • మజ్లిస్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ మాధవీలత నిరసన

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని బీబీ బజార్ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత ఒకే మార్గంలో రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరు అభ్యర్థులు తమ అనుచరులు, సెక్యూరిటీతో ఒకే మార్గంలో తమ తమ కార్లల్లో వచ్చారు. బీబీ బజార్ చౌరస్తా వద్ద మజ్లిస్ పార్టీ కార్యకర్తలు మాధవీలతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ పోలీసులను మాధవీలత ప్రశ్నించారు. దీంతో మజ్లిస్ పార్టీ కేడర్‌ను పోలీసులు అక్కడి నుంచి పంపించారు. 

మజ్లిస్ రిగ్గింగ్‌కు పాల్పడిందని మాధవీలత ఆరోపణ

హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని మాధవీలత ఆరోపించారు. పోలింగ్ బూత్ గేటు తెరవడం లేదంటూ ఆమె అక్కడే నిరసనకు కూడా దిగారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రియాసత్ నగర్... జమాల్ కాలనీలోని ఓ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతోందని... అందుకే వారు తలుపులు తెరవడం లేదంటూ ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News