AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీ ఠాకూర్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

YSRCP complaint to EC on AB Venkateswara Rao
  • టీడీపీ కార్యాలయంలో కూర్చొని ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదు
  • జిల్లాల పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తున్నారని ఆరోపణ
  • టీడీపీకి అనుకూలంగా పని చేయాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదు
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీ ఆర్పీ ఠాకూర్ లపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీకి అనుకూలంగా పని చేసేలా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులో వైసీపీ పేర్కొంది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరూ కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్ లు చేసి... వారిని ప్రభావితం చేస్తున్నారని తెలిపింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని చెప్పింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
AB Venkateswara Rao
Telugudesam
YSRCP

More Telugu News