Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఒకానొక సమయంలో దాదాపు 900 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్న మార్కెట్లు
  • చివరకు 112 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పతనమయింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 72,776కి చేరుకుంది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 22,104 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.83%), యాక్సిస్ బ్యాంక్ (1.33%), టీసీఎస్ (1.31%), సన్ ఫార్మా (1.30%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.27%). 

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-8.34%), ఎన్టీపీసీ (-1.35%), భారతి ఎయిర్ టెల్ (-1.23%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.16%), టైటాన్ (-1.12%).

  • Loading...

More Telugu News