Polling: తెలుగు రాష్ట్రాల్లోని ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగిసిన పోలింగ్!

Some Areas in Two Telugu States Closing Polling on 4pm
  • ఏపీలోని రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో సాయంత్రం 4 గంట‌ల‌కే ముగిసిన‌ పోలింగ్  
  • తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో సేమ్ సీన్‌ 
  • అప్ప‌టికే క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అవ‌కాశం

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వా‌రావుపేట‌, ములుగులో ‌కూడా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది. అయితే, అప్ప‌టికే క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం ఇస్తున్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ కొన‌సాగుతోంది.

  • Loading...

More Telugu News