గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగుంది: సీఈఓ వికాస్ రాజ్
- ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్న వికాస్ రాజ్
- ఎప్పటిలానే ఈసారి కూడా హైదరాబాద్‌లో తక్కువగానే పోలింగ్ పర్సంటేజ్
- రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై కూడా విచారణ జరుగుతుందన్న సీఈఓ
- మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్
ఇక రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.