Pakistan: అలాగైతే పాకిస్థాన్ కు గాజులు తొడిగిస్తాం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

we will make pakistan wear bangles PM Modi said
  • నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మోదీ స్పందన
  • పాకిస్థాన్ లో కరెంటు లేదు, పిండి లేదు.. చివరికి గాజులు కూడా లేవా అని వ్యాఖ్య
  • పరోక్షంగా పాక్ ఆర్థిక దుస్థితిపై విమర్శలు

పాకిస్థాన్ వద్ద వేసుకోవడానికి గాజులేమీ లేకపోతే.. తాము పాకిస్థాన్ కు గాజులు తొడిగిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా.. పాక్ ఆర్థిక దుస్థితిని ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించారు.

ఫరూక్ అబ్దుల్లా ఏమన్నారంటే..
ఇటీవలి ఓ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన కశ్మీర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ చేతికి గాజులు వేసుకుని ఏమీ కూర్చోలేదని.. దాని దగ్గర అణు బాంబులు ఉన్నాయని, అవి వేస్తే భారత దేశానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. 

గట్టిగా కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ..
సోమవారం బీహార్ లోని ముజఫర్ పూర్ పర్యటించిన ప్రధాని మోదీ.. ఫరూక్ అబ్దుల్లా పేరును ప్రస్తావించకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘పాకిస్థాన్ గాజులు వేసుకుని లేకుంటే.. మనం పాకిస్థాన్ గాజులు తొడిగిద్దాం.. వాళ్లకు ఆహారమైన గోధుమ పిండి లేదు.. కరెంటు సరిగా లేదు. ఇప్పుడు వాళ్ల దగ్గర చివరికి గాజులు కూడా లేవని నాకు ఇప్పుడే తెలిసింది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News