MS Dhoni: ధోనీ దేవుడు.. అతడికి భవిష్యత్తులో దేవాలయాలు కడతారు: అంబటి రాయుడు

Temples will be built for MS Dhoni he is the God of Chennai Ambati Rayudu
  • సీఎస్‌కే సారథి ధోనీపై అంబటి రాయుడు ప్రశంసలు
  • తమిళ ప్రజలు ధోని కోసం గుడి కడతారని జోస్యం
  • సీఎస్‌కేకి, టీమిండియాకు ధోని ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడన్న రాయుడు

టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు అనేక చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ కోసం భవిష్యత్తులో తమిళ ప్రజలు దేవాలయాలు కడతారని టీమీండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. రజనీకాంత్, ఖుష్బూ లాంటి స్టార్లకు తమిళ అభిమానులు దేవాలయాలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశాడు. తన సారథ్య పటిమ, ఆటతీరుతో సీఎస్‌కే అభిమానులను కొన్నేళ్లుగా మెప్పిస్తున్న ధోనీ కూడా ఈ జాబితాలో చేరొచ్చని చెప్పాడు.  ‘‘చెన్నైకి ధోని దేవుడు. రెండు ప్రపంచకప్‌ టైటిళ్లు, ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లతో ధోనీ సీఎస్‌కే అభిమానులను ఎంతో ఉర్రూతలూగించారు. తన టీం సభ్యులకు అండగా నిలిచాడు. టీమిండియా, సీఎస్‌కే విజయం కోసం నిరంతరం కృషి చేశాడు. అతడో లెజెండ్’’ అంటూ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. 

కాగా, ఆదివారం ఆర్ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు వికెట్ల తేడాతో ఆర్ఆర్‌పై గెలుపు సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఆడిన 13 మ్యాచుల్లో ఏడింటిలో సీఎస్‌కే విజయం సాధించింది. 14 పాయింట్లు, +0.528 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక మే 18న ఆర్సీబీతో సీఎస్‌కే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది.

  • Loading...

More Telugu News