eye balls popping: వామ్మో.. ఏం చూపురా నాయనా! నెట్టింట బెంగళూరు మహిళ ఫొటో వైరల్

Pic of wide eyed woman at Bengaluru vegetable shop sparks hilarious X reactions
  • ఓ కూరగాయల షాప్ ముందు గుడ్లురుముతూ చూస్తున్న ఫొటోను చూసి నెటిజన్ల బెంబేలు
  • కారణం ఏమిటంటూ ఆరా
  • రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్న వైనం

బెంగళూరులోని ఓ కూరగాయల షాప్ ముందు వేలాడదీసిన ఓ మహిళ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. గుడ్లురుముతూ కోపంగా చూస్తున్న ఆమె ఫొటోను చూసిన వారంతా వామ్మో ఏం చూపురా నాయనా అంటూ దెబ్బకు జడుసుకుంటున్నారు! ఇందుకు కారణం ఏమిటని ఆరా తీస్తూ రకరకాల కామెంట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

నిహారిక అనే ‘ఎక్స్’ యూజర్ షేర్ చేసిన కాసేపటికే ఈ ఫొటో నెట్టింట హల్ చల్ చేసింది. షేర్ చేసిన రెండు రోజులకే ఈ ఫొటోకు దాదాపు 95 వేల వ్యూస్ లభించాయి. బెంగళూరులోని కాత్రిగుప్పె వాటర్ ట్యాంక్ సమీపంలోని షాప్ వద్ద ఈ ఫొటో ఏర్పాటు చేసినట్లు కొందరు నెటిజన్లు గుర్తించారు.

దీని వెనక పెద్ద స్టోరీ ఏమీ లేదని.. షాప్ కు చెడు దృష్టి తగలకుండా ఉండేందుకే ఈ ఫొటో ఏర్పాటు చేశారని అసలు విషయం తెలిసిన వారు చెప్పుకొచ్చారు. దీనిపై చాలా మంది యూజర్లు సరదా కామెంట్లు పోస్ట్ చేశారు. బేరాలు ఆడకుండా నోర్మూసుకొని కూరగాయలు కొనుక్కు వెళ్లండి అన్నట్లుగా ఆమె చూపు ఉందని ఓ యూజర్ పేర్కొన్నాడు. మరొకరేమో ఈ ఫొటోను చూశాక ఇక నిద్ర ఎలా పడుతుందంటూ కామెంట్ చేశాడు. నాకు రెండు రోజులుగా నిద్రపట్టకుండా చేసినందుకు మా డాక్టర్ మిమ్మల్ని సంప్రదిస్తారంటూ మరొకరు వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాలు రాక ముందు ఉన్న సీసీ కెమెరాలు ఇవేనంటూ ఓ యూజర్ చమత్కరించగా జీతం పెంచాలని అడిగినప్పుడు మేనేజర్ చూపు ఇలాగే ఉంటుందని ఇంకొకరు పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News