వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంమైన ఐపీఎల్ మ్యాచ్... ఓవర్ల కుదింపు
- ఐపీఎల్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ × ముంబయి ఇండియన్స్
- కోల్ కతాలో వర్షం
- ఆలస్యంగా టాస్... 16 ఓవర్లకు కుదించిన అంపైర్లు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టు 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 6 పరుగులకే వెనుదిరిగాడు.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (7) నిరాశపర్చగా... వెంకటేశ్ అయ్యర్ 37, నితీశ్ రానా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లలో నువాన్ తుషార 1, బుమ్రా 1, అన్షుల్ కాంభోజ్ 1 వికెట్ తీశారు.