Rahul Gandhi: ఇడుపులపాయలో వైఎస్సార్ కు రాహుల్ ఘన నివాళి

Rahul Gandhi Ys Sharmila pay tributes to YSR
  • కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • వైఎస్ షర్మిలతో కలసి ఇడుపుల పాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన రాహుల్
  • వైఎస్సార్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రాహుల్, షర్మిల

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం కడప చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలకారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో కలసి ఇడుపుల పాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు వెళ్లి వైఎస్సార్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ తన తండ్రికి సోదరుడి వంటి వారని రాహుల్ తెలిపారు.

అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆ వీడియోను అభిమానులకు షేర్ చేశారు. కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న వైఎస్ షర్మిల తరఫున కడప పార్లమెంట్ పరిధిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కు నివాళులర్పించిన వారిలో కేవీపీ రామచంద్రరావు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News