: రాజ్ కుంద్రాను అరెస్టు చేయలేమన్న ఢిల్లీ పోలీసులు
బెట్టింగ్ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్ కుంద్రాను అరెస్టు చేయలేమని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. డాక్యుమెంటరీ రూపంలో (దస్త్రాల రూపంలో) ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ కారణంగా అరెస్టు చేయడం కుదరదంటున్నారు. ఈ క్రమంలో కుంద్రాను అప్పుడే అరెస్టుచేసే అవకాశం లేదని తెలుస్తోంది. రెండురోజుల కిందట ఢిల్లీ పోలీసుల విచారణలో, ఐపీఎల్ లో సొంత జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుపై బెట్టింగ్ కు పాల్పడినట్టు కుంద్రా అంగీకరించారు. దాంతో ఆయనను అరెస్టు చేస్తారని పలు ఊహాగానాలు వినిపిస్తుండడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు.