తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
- జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ వర్తిస్తుందన్న సుప్రీం
- జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలన్న కోర్టు
- కేజ్రీవాల్ విడుదలపై స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్
కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై పలువురు నేతలు స్పందించారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ రావడం సంతోషంగా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. కేజ్రీవాల్ విడుదల కేవలం న్యాయానికి ప్రతీక మాత్రమే కాదని... ఇది ఇండియా కూటమికి బలం అనీ అన్నారు. ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసే దిశగా తమకు బలాన్ని ఇస్తుందన్నారు.