Berasia Polling Booth: మైన‌ర్ కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ నేత.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

BJP Leader Vinay Mehar Films Minor Son Casting Vote in Berasia Polling Booth in Bhopal Video Goes Viral
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బెరాసియాలో ఘ‌ట‌న‌
  • బీజేపీ నేత విన‌య్ మెహ‌ర్ త‌న మైన‌ర్ కుమారుడితో క‌లిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన వైనం
  • ఆ పిల్లాడు ఈవీఎంలో బ‌ట‌న్ నొక్కి బీజేపీకి ఓటు వేస్తుండ‌గా వీడియో తీసిన విన‌య్
  • నెట్టింట వీడియో వైర‌ల్ కావ‌డంతో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన భోపాల్ క‌లెక్ట‌ర్‌

మూడో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఈ నెల 7న జ‌రిగిన పోలింగ్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బెరాసియాలో విన‌య్ మెహ‌ర్ అనే బీజేపీ నేత బ‌రి తెగించారు. ఆయ‌న‌ త‌న మైన‌ర్ కుమారుడితో పోలింగ్ కేంద్రానికి వ‌చ్చారు. ఆ పిల్లాడు ఈవీఎంలో బ‌ట‌న్ నొక్కి బీజేపీకి ఓటు వేస్తుండ‌గా వీడియో తీశారు. బాలుడు ఓటు వేసిన దృశ్యాలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. 

దీంతో స్పందించిన భోపాల్ క‌లెక్ట‌ర్ కౌశ‌లేంద్ర విక్ర‌మ్ సింగ్ ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన బీజేపీ నేత విన‌య్ మెహ‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయించారు. అలాగే ఈ ఘ‌న‌ట‌తో సంబంధం ఉన్న‌ ఆ పోలింగ్ కేంద్ర‌లోని ప్రిసైడింగ్ అధికారి సందీప్ సైనీతో స‌హా సిబ్బంది అంద‌రినీ స‌స్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News