Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్

  • 1,062 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 234 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • ఐదున్నర శాతం నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు విలువ
Stock Markets ends in huge losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అక్కడి నుంచి ట్రేడింగ్ చివరి వరకు మార్కెట్లు పతనమవుతూనే వచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,062 పాయింట్లు కోల్పోయి 72,404కి దిగజారింది. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 22,068కి పడిపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.86%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.48%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.27%), ఇన్ఫోసిస్ (0.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.49%). 

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-5.56%), ఏసియన్ పెయింట్స్ (-4.51%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-3.46%), ఐటీసీ (-3.27%), బజాజ్ ఫైనాన్స్ (-2.83%).

  • Loading...

More Telugu News