Narendra Modi: భారత్‌ను ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చేందుకు ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ, ముఖేశ్ అంబానీల కృషి!: సీఎన్ఎన్ రిపోర్ట్

PM Modi and Gautam Adani and Mukesh Ambani shaping India to become economic superpower say CNN Report
  • అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే రంగాల్లో ప్రధాని పెట్టుబడులు పెడుతున్నారని ప్రశంసలు
  • అంబానీ, అదానీ పెట్టుబడులపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న రిపోర్ట్ 
  • 21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని విశ్లేషణ

21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్ అవతరించనుందని, చైనాకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేంద్రంగా భారత్ అవతరించనుందని సీఎన్ఎన్ రిపోర్ట్ అంచనా వేసింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థను సూపర్ పవర్‌గా రూపాంతరం చెందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, దేశీయ దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకోసం బాటలు వేస్తున్నారని విశ్లేషించింది. 

అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న రంగాల్లో అదానీ, అంబానీ పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు అభినందిస్తున్నారని సీఎన్ఎన్ రిపోర్ట్ విశ్లేషించింది. అభివృద్ధిని ప్రోత్సహించేందుకుగానూ బీజేపీ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చించడం ద్వారా భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల పరివర్తనను ప్రారంభించిందని పేర్కొంది. మోదీ ప్రభుత్వం డిజిటల్ కనెక్టివిటీని భారీగా ప్రోత్సహిస్తోందని, ఈ విధానం వాణిజ్యం, రోజువారీ జీవితాలను మరింత మెరుగుపరుస్తోందని కొనియాడింది.

దేశంలో విప్లవాత్మక మార్పుల్లో అదానీ, అంబానీ ఇద్దరూ కీలక వ్యక్తులుగా మారారని ప్రశంసించింది. 2023లో భారత్ 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని, మోదీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 4 స్థానాలు ఎగబాకి యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించిందని ప్రస్తావించింది. 2027 నాటికి అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ నిలవనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారని సీఎన్ఎన్ రిపోర్ట్ విశ్లేషించింది.

  • Loading...

More Telugu News