Road Show: విజయవాడలో అట్టహాసంగా కొనసాగుతున్న మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో

NDA Road Show in Vijayawada continues in glittering style
  • విజయవాడలో ఎన్డీయే కూటమి రోడ్ షో
  • ఒకే వాహనంపై మోదీ, బాబు, పవన్
  • భారీగా తరలివచ్చిన మూడు పార్టీల శ్రేణులు

ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ముగ్గురూ హాజరైన భారీ రోడ్ షో విజయవాడలో ప్రారంభమైంది. పీవీపీ మాల్ నుంచి మొదలైన ఈ రోడ్ షో నగరంలోని ప్రధాన రహదారిపై అట్టహాసంగా సాగింది. 

బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా హాజరుకావడంతో రోడ్ షోలో జనసంద్రం కనిపించింది. మూడు పార్టీల జెండాల రెపరెపలు, ప్లకార్డులు, నినాదాలతో బెజవాడలో ఎన్డీయే కూటమి కోలాహలం మిన్నంటింది. 

ఒకే వాహనంపై నిలుచున్న మోదీ, చంద్రబాబు, పవన్ లను చూసేందుకు ప్రజలు కూడా పోటెత్తారు. ప్రజలకు అభివాదం చేస్తూ కూటమి అగ్రనేతలు ముందుకు సాగారు. ఈ రోడ్ షో బెంజి సర్కిల్ వరకు కొనసాగనుంది.

  • Loading...

More Telugu News