Pranitha: దక్షిణ, ఈశాన్య ప్రజలపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలు... సినీ నటి ప్రణీత కౌంటర్

I am a South Indian and I look Indian says Actress Pranitha
  • నేను దక్షిణ భారతీయురాలిని... భారతీయురాలిగానే కనిపిస్తున్నానన్న ప్రణీత
  • ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన సినీ నటి
  • శామ్ పిట్రోడాకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దక్షిణాదివారు ఆఫ్రికన్లలా, ఈశాన్య ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోపక్క, శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటి ప్రణీత స్పందించారు. ఒక్క మాటలో కౌంటర్ ఇచ్చారు. 'నేను దక్షిణ భారతీయురాలిని... భారతీయురాలిగానే కనిపిస్తున్నాను' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాను దక్షిణ భారతం నుంచి వచ్చానని... భారతీయురాలిగానే కనిపిస్తున్నానని పేర్కొన్నారు. తన బృందంలో ఈశాన్య భారత్ నుంచి ఉత్సాహవంతమైన సభ్యులు ఉన్నారని, వారూ భారతీయులుగానే కనిపిస్తారన్నారు. జాత్యహంకారానికి మార్గదర్శి అయిన రాహుల్ గాంధీకి మనమంతా ఆఫ్రికన్, చైనీస్, అరబ్, వైట్‌గా కనిపిస్తామని ఎద్దేవా చేశారు. మీ మనస్తత్వాన్ని, మీ వైఖరిని బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు అంటూ చురక అంటించారు.
Pranitha
Congress
BJP
Nirmala Sitharaman

More Telugu News