Hema Sundar: సినిమా పిచ్చి .. వేషాల కోసం పడిగాపులు: నటుడు హేమసుందర్

Hema Sunadar Interview
  • అక్కినేని వలన ఎంట్రీ ఇచ్చానని వెల్లడి 
  • 400 సినిమాలకి పైగా చేశానని వివరణ 
  • సినిమా కష్టాలు తాను పడలేదని వ్యాఖ్య   

1970లలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన హేమసుందర్, ఆ తరువాత కాలంలో 400 సినిమాలకి పైగా చేశారు. సహజమైన నటన .. ఆకట్టుకునే వాయిస్ ఆయన సొంతం. అలాంటి హేమసుందర్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "మొదటి నుంచి నాకు నటన పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువలన నేను మద్రాస్ కి చేరుకున్నాను. 

ఇక వేషాల కోసం ఏకంగా నేను అక్కినేని నాగేశ్వరరావుగారినే కలిశాను. ఆయన షూటింగ్స్ జరుగుతున్న చోటుకి వెళ్లి, ఆయన కళ్లలో పడటానికి ప్రయత్నం చేసేవాడిని. ఆయన సిఫార్స్ తోనే మొదటిసారిగా నన్ను నేను తెరపై చూసుకోగలిగాను. ఇక అక్కడి నుంచి నా ప్రయాణం ఆగలేదు" అని చెప్పారు. 

"ఈ రోజుల్లో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవడం చాలా తేలిక. కానీ అప్పట్లో ఒక మంచి వేషం సంపాదించుకోవడం చాలా కష్టమైన విషయం. నిర్మాత ఇళ్ల దగ్గర ఆర్టిస్టులు పడిగాపులు పడటం నేను చూశాను. సినిమా పిచ్చితో ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో కూడా చూశాను. అలాంటి కష్టాలు నాకు ఎదురుకాకపోవడానికి కారణం భగవంతుడి అనుగ్రహమేనని అనుకుంటాను" అని అన్నారు.

  • Loading...

More Telugu News