Daryl Mitchell: ప్రాక్టీస్ సంద‌ర్భంగా అభిమానికి త‌గిలిన బంతి.. డారిల్ మిచెల్ చేసిన ప‌నిపై నెటిజ‌న్ల హ‌ర్షం..!

Daryl Mitchell Shot in Training Breaks Fan iPhone
  • పంజాబ్‌తో ధ‌ర్మ‌శాల స్టేడియంలో జ‌రిగిన మ్యాచుకు మందు ప్రాక్టీస్ స‌మ‌యంలో ఘ‌ట‌న‌
  • సీఎస్‌కే ఆట‌గాడు డారిల్ మిచెట్ కొట్టిన షాట్ అభిమానికి తాకి ప‌గిలిన ఐఫోన్‌
  • ఇది గ‌మ‌నించిన మిచెల్ అభిమానికి క్ష‌మాప‌ణలు చెప్పిన వైనం
  • అలాగే త‌న చేతి గ్లౌజును అభిమానికి గిఫ్ట్‌గా అందించిన కివీస్ స్టార్‌
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) తో ధ‌ర్మ‌శాల స్టేడియంలో జ‌రిగిన మ్యాచుకు ముందు ప్రాక్టీస్ సంద‌ర్భంగా సీఎస్‌కే ఆట‌గాడు డారిల్ మిచెల్ కొట్టిన షాట్ ప్ర‌మాద‌వ‌శాత్తు స్టాండ్స్‌లో ఉన్న‌ అభిమానికి త‌గిలింది. ఆ స‌మ‌యంలో త‌న ఐఫోన్‌తో ఆ అభిమాని వీడియో తీస్తున్నాడు. అదే స‌మ‌యంలో మిచెల్ ఆడిన షాట్ నేరుగా వెళ్లి అత‌నికి తాకింది. దాంతో అభిమాని ఐఫోన్ కింద ప‌డిపోయి ప‌గిలిపోయింది. ఇది గ‌మ‌నించిన మిచెల్ అతనికి క్ష‌మాప‌ణలు చెప్పాడు. అంతేకాకుండా త‌న చేతి గ్లౌజును అభిమానికి గిఫ్ట్‌గా అందించాడు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు మిచెల్ చేసిన ప‌నిప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
Daryl Mitchell
CSK
IPL 2024
iPhone
Cricket
Sports News

More Telugu News