Fact Check: ఆ జనం తెలంగాణలో మోదీ రోడ్‌షోకు వచ్చినవారు కాదా?.. మరి నిజమేంటి?

  • కొల్లాపూర్‌లో మోదీ రోడ్‌షోకు హాజరైన జనమంటూ ఫొటో వైరల్
  • వారంతా దేశంపై ప్రేమతో, మోదీపై నమ్మకంతో వచ్చారని క్యాప్షన్
  • కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గుజరాత్‌లో నిరసన అంటూ గతంలో ఇదే ఫొటో వైరల్
  • నిజానికి అది చైనాలోని గ్వాంగ్జౌ‌లో ఒలింపిక్ టార్చ్‌కు సంబంధించిన ఫొటో
This Image Isnt From PM Modis Kollapur Roadshow Then What Is The Truth

తెలంగాణలోని కొల్లాపూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్‌షోకు హాజరైన జనమంటూ వాట్సాప్‌లో ఇటీవల ఓ ఫొటో వైరల్ అయింది. అందులో ఇసుకేస్తే రాలనంతమంది జనం ఉన్నారు. వీరంతా డబ్బు, మద్యం పంచడం వల్ల రాలేదని, దేశం మీద ప్రేమ, మోదీ అభివృద్ధి మీద నమ్మకం ఉండడం వల్లే వీరంతా హాజరయ్యారంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అయితే, ఈ ఫొటోపై ‘ఫ్యాక్ట్ చెక్’ చేయగా బోల్డన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.

   ‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గుజరాత్‌ ప్రజలు తెలుపుతున్న నిరసన’ అంటూ ఇదే ఫొటోను వాడుకున్నారు. నిజమేంటంటే.. ఈ ఫొటో మోదీ రోడ్‌షోదీ కాదు.. గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు సంబంధించినది కూడా కాదు. ఇదే ఫొటో 12 మే 2008లో ‘ఫ్లికర్’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది. ఈ ఫొటో చైనాలోని గ్వాంగ్జౌలోనిది. చైనాలో నిర్వహించిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఒలింపిక్ టార్చర్‌ను తీసుకెళ్తున్నప్పటి ఫొటో ఇది.  

  • Loading...

More Telugu News