Madepalli Srinivas: కొయ్యలగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్ సస్పెన్షన్

Janasena party suspends Madepalli Srinivas
  • మాదేపల్లి శ్రీనివాస్ పార్టీ గీత దాటాడంటూ చర్యలు
  • పిఠాపురం రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా తాత్కాలిక సస్పెన్షన్
  • రెండు వారాల్లోగా లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం

పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం పట్టణ జనసేన అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్ (రాయవరం శ్రీను)పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ గీత దాటాడంటూ జనసేన అగ్రనాయకత్వం అతడిపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 

"మాదేపల్లి శ్రీనివాస్ ను అనేక మార్లు హెచ్చరించినప్పటికీ కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా, టీడీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలాసార్లు ప్రవర్తించాడు. అదే విధంగా జనసేన నాయకత్వంతో, జనసేన శ్రేణులతోనూ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే మాదేపల్లి శ్రీనివాస్ ను జనసేన పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం. తన మీద వచ్చిన ఆరోపణలకు రెండు వారాల లోపు లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని శ్రీనివాస్ ను కోరుతున్నాం. ఆ సంజాయిషీకి అనుగుణంగా పార్టీ నుంచి తదుపరి చర్యలు ఉంటాయి. అప్పటివరకు మాదేపల్లి శ్రీనివాస్ ను పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని పార్టీ నిర్ణయించింది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News