Jasprit Bumrah: బుమ్రా కుమారుడు అంగ‌ద్‌ను చూశారా?.. ఇదిగో ఫొటో!

Jasprit Bumrah Son Angad Face For The First Time As They Cheered
  • నిన్న‌టి హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ అంగ‌ద్ బుమ్రా ఫొటో 
  • 2021 మార్చి 15న జ‌స్ప్రీత్ బుమ్రా, సంజనా గ‌ణేశ‌న్ వివాహం
  • ఈ దంప‌తుల‌కు గతేడాది కుమారుడు అంగ‌ద్ బుమ్రా జ‌న‌నం
భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా కుమారుడు అంగ‌ద్ ఫొటో తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సోమ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తో మ్యాచ్ చూసేందుకు ముంబై బౌల‌ర్ బుమ్రా భార్య సంజ‌నా గ‌ణేశ‌న్ త‌న కుమారుడితో క‌లిసి వ‌చ్చారు. 

ఇక మ్యాచ్‌లో హైద‌రాబాద్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ను బుమ్రా అవుట్ చేయ‌గానే స్టాండ్స్‌లో ఉన్న ఆయ‌న భార్య‌, కుమారుడిని కెమెరామ‌న్ చూపించారు. దీంతో తొలిసారి అంగ‌ద్ బుమ్రా ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లైంది.   
ఇదిలాఉంటే.. వృత్తిరీత్యా స్పోర్ట్స్ యాంకర్ అయిన‌ సంజన.. ఐపీఎల్ వంటి టోర్నీలను కూడా హోస్ట్ చేశారు. అంతకుముందు 2014లో మిస్ ఇండియా పీజెంట్‌ పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంతకాలం మోడల్‌గా పనిచేసి, అనంతరం రియాలిటీ షో యాంకర్‌గా కెరీర్ ఎంచుకున్నారు. ఇది జరిగిన కొంతకాలానికి టీమిండియా పేస‌ర్‌ బుమ్రాతో ప్రేమ‌లో ప‌డ‌డం, పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగింది. 2021 మార్చి 15న జ‌స్ప్రీత్ బుమ్రా, సంజనా గ‌ణేశ‌న్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంప‌తుల‌కు గతేడాది కుమారుడు అంగ‌ద్ బుమ్రా జ‌న్మించాడు.
Jasprit Bumrah
Angad Bumrah
Sanjana Ganeshan
IPL 2024

More Telugu News