Nara Lokesh: మీ వైసీపీ స‌ర్కారుకి మే13న ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యింది కాట‌సానీ!: నారా లోకేశ్

Nara Lokesh responds on Banaganapalle incident
  • బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అర్ధాంగిపై దాడి
  • కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి అనుచరుల దాడిని ఖండిస్తున్నామన్న లోకేశ్ 
  • ఓటమి భయంతో మహిళలపై దాడులు చేస్తుండడం దారుణమంటూ ట్వీట్

నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అర్ధాంగి ఇందిరమ్మపై దాడి జరగడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బనగానపల్లె కూరగాయల మార్కెట్ సమీపంలో ఇందిరమ్మ ప్రచారం చేస్తుండగా... కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 

ఐదేళ్లుగా జనాలను కాటు వేసిన కాటసాని రామిరెడ్డి కుటుంబం ఇప్పుడు ఓటమి భయంతో మహిళలపై కూడా దాడులకు పాల్పడడం చాలా దారుణం అని లోకేశ్ పేర్కొన్నారు. మీ వైసీపీ సర్కారుకు, అరాచకాలకు మే 13న ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయింది కాటసానీ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు దాడి వీడియోను కూడా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News