Gujarat: రెండు చేతులు లేకపోయినా.. బాధ్య‌త‌గా కాలితో ఓటేశాడు.. వైర‌ల్ వీడియో!

  • గుజ‌రాత్‌లోని న‌డియాడ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన అంకిత్ సోని
  • 20 ఏళ్ల‌ క్రితం ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినట్లు వెల్ల‌డి
  • అయినా గత 20 ఏళ్ల‌లో తాను ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదన్న అంకిత్‌
  • 'ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయండి' అంటూ అంకిత్ పిలుపు
Ankit Soni Who Lost Both Hands 20 Years Ago Casts Vote Using Foot In Gujarat Nadiad

ఎన్నికల వేళ ఓటేసేందుకు చాలామందికి బ‌ద్ద‌కం. కొందరైతే కార్యాల‌యాల‌కు సెలవిచ్చినా ఇంట్లోనే ఉండిపోతారు. కానీ పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు మాత్రం వేయరు. అయితే, ఓ వ్య‌క్తి త‌న‌కు రెండు చేతులు లేక‌పోయినా త‌న బాధ్య‌త‌గా కాలితో ఓటు వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఇవాళ గుజరాత్‌లో మూడో దశ పార్ల‌మెంట్‌ ఎన్నికల్లో అంకిత్‌ సోని అనే వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా కాలితో ఓటువేసి ఔరా అనిపించాడు. గుజ‌రాత్‌లోని న‌డియాడ్‌లోని పోలింగ్ బూత్‌లో త‌న ఓటు వేశాడు. ఈ సంద‌ర్భంగా 'ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయండి' అంటూ అంకిత్ పిలుపునిచ్చాడు. శ‌రీరంలో అన్ని అవయవాలు క‌రెక్టుగా ఉన్నా ఓటు వేసేందుకు బద్దకించేవాళ్ల చెంపమీద కొట్టినట్టుగా రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును వినియోగించుకున్నాడు. చిత్తశుద్ధి ఉండాలేగానీ దేనికీ అవిటితనం అడ్డుకాదని అత‌డు నిరూపించాడు.

తనకు 20 ఏళ్ల‌ క్రితం జ‌రిగిన‌ ఓ ప్రమాదంలో రెండు చేతులు తెగిపోయాయని అంకిత్‌ సోని తెలిపాడు. అయినా గత 20 ఏళ్ల‌లో తాను ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదని చెప్పాడు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో తాను ఓటు వేస్తానని తెలిపాడు. అంకిత్ కాలితో ఓటు వేసిన వీడియో నెట్టింట ప్ర‌త్య‌క్షం కావ‌డంతో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఓటు వేసేందుకు బద్దికించే వాళ్లు అంకిత్‌ సోనిని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News