Sai Dharam Tej: తాటిపర్తిలో దాడిలో గాయపడిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ను పరామర్శించిన సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej visits Jana Sena worker injured in attack in Pithapuram
  • గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఘటన   
  • గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త న‌ల్ల‌ల శ్రీధ‌ర్‌కు గాయం
  • వైసీపీ గూండాలకి గెలుపుతోనే సమాధానం ఇద్దామ‌న్న సాయి ధరమ్ తేజ్
పిఠాపురంలో తన మేనమామ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌ ఆదివారం నిర్వహించిన ఎన్నిక‌ల‌ ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్‌ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మంగ‌ళ‌వారం సాయి ధ‌ర‌మ్ తేజ్ పరామర్శించారు. కొద్దిసేపు అక్క‌డ గ‌డిపి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ గూండాలకి గెలుపుతోనే సమాధానం ఇద్దామ‌ని సాయి పేర్కొన్నారు. కాగా, వైసీపీ వాళ్లే ఈ దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Sai Dharam Tej
Janasena
Pithapuram

More Telugu News