Maldives: దయచేసి మాల్దీవులలో పర్యటించండి.. భారతీయులను కోరిన ఆ దేశ పర్యాటక మంత్రి

Amid Strained Ties Maldives Urges India Please Be Part Of Our Tourism
  • మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇవ్వాలని వేడుకున్న ఆ దేశ మంత్రి ఇబ్రహిం ఫైసల్
  • టూరిజంపైనే తమ ఆర్థిక వ్యవస్థ ఆధారపడిందని అభ్యర్థన
  • భారత్‌తో సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని వెల్లడి

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అక్కడికి వెళ్లే భారతీయ సందర్శకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అక్కడి పర్యాటక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. అయితే తిరిగి భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి టూరిజమ్ కంపెనీలు ఇదివరకే పలు ప్రయత్నాలు చేయగా.. తాజాగా ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహిం ఫైసల్ రంగంలోకి దిగారు.

పర్యాటక రంగంపైనే ఎక్కువగా ఆధారపడే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని భారతీయ పర్యాటకులను ఇబ్రహిం ఫైసల్ అభ్యర్థించారు. తమ దేశ ప్రజలు, ప్రభుత్వం భారతీయుల రాకపోకలకు ఘన స్వాగతం పలుకుతాయని ఇబ్రహిం ఫైసల్ అన్నారు. టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడే తమ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు తోడ్పాటు అందించాలని మాల్దీవుల మంత్రిగా తాను కోరుతున్నానని అన్నారు. దయచేసి సహకరించాని అభ్యర్థించారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మాల్దీవులు, భారత్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని, కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటోందని అన్నారు. తాము భారత్‌తో ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కాగా ఈ ఏడాది జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ తీరంలోని లక్షద్వీప్ దీవుల సందర్శించి అక్కడి ఫొటోలు, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే లక్ష దీప్ బీచ్‌లకు సంబంధించిన ఈ ఫొటోలు, వీడియోలపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. భారత్‌తో పాటు ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా భారతీయ పర్యాటకులు మాల్దీవులు వెళ్లడం మానుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News