Mallareddy: 30 మంది కార్పొరేటర్లను నేనే కాంగ్రెస్‌లోకి పంపించా: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

myself told the corporators to go to Congress says Ex minister an BRS Senior leader Mallareddy
  • కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని కార్పొరేటర్లకు చెప్పానన్న బీఆర్ఎస్ సీనియర్
  • హస్తం పార్టీలో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయాలని సూచించానన్న మేడ్చల్ ఎమ్మెల్యే
  • రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన మల్లారెడ్డి వ్యాఖ్యలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ పరిధిలోని వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లకు కార్పొరేటర్లుగా ఉన్న దాదాపు 30 మందిని తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమంటూ చెప్పానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు హస్తం పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కార్పొరేటర్లకు తాను సూచించానని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌‌లో ఉంటూ పార్టీలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కార్పొరేటర్లతో చెప్పానని అన్నారు. అయితే తాము కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారని మల్లారెడ్డి అన్నారు. హస్తం పార్టీలోని సీనియర్‌ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు ప్రతి రోజూ తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు న్యూబోయిన్‌పల్లి సౌజన్య కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
Mallareddy
BRS
Congress
Lok Sabha Polls

More Telugu News