Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

CM Revanth Reddy praises VH
  • అంబర్‌పేటలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
  • అంబర్‌పేటలో కబ్జాలను వీహెచ్ అడ్డుకున్నారని కితాబు
  • బతుకమ్మకుంటలోనే బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని స్పష్టీకరణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సోమవారం ఆయన అంబర్‌పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అంబర్ పేటలో కబ్జాలను వీహెచ్ అడ్డుకున్నారని కితాబునిచ్చారు.

అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలోనే తాము బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలోనే ఓఆర్ఆర్, ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీటిని తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్సే అన్నారు.
Revanth Reddy
VH
Congress
Lok Sabha Polls

More Telugu News