Boy Dies: ప్రైవేటు భాగానికి క్రికెట్ బంతి తగిలి 11 ఏళ్ల బాలుడి మృతి

11year old dies after cricket ball hits his private part in Pune
  • క్రికెట్ ఆడుతుండగా ఘటన
  • బంతి తగిలిన వెంటనే కుప్పకూలిన బాలుడు
  • వెంటనే ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ

రహస్య భాగానికి బంతి తగలడంతో క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిందీ ఘటన. బంతి బాలుడికి తగలడం, ఆ వెంటనే అతడు కుప్పకూలిపోవడం అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయింది. బాధిత కుర్రాడు శౌర్య బౌలింగ్ చేయగా బ్యాటర్ బలంగా కొట్టిన బంతి నేరుగా వచ్చి అతడి రహస్య భాగాలకు తాకింది. ఆ వెంటనే బాలుడు కుప్పకూలిపోయాడు.

బాలుడు కిందపడడంతోనే ఆందోళన చెందిన మిగతా కుర్రాళ్లు వెంటనే అతడి వద్దకు చేరుకుని లేపే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శౌర్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News