KTR: రేవంత్​.. నువ్వు కట్టుకుంటావా చీర? రాహుల్ గాంధీకి కట్టిస్తావా?: కేటీఆర్ సంచలన ట్వీట్​

Revanth will you wear saree or Rahul Gandhi will wear KTR fire
  • నిర్మల్ సభలో రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పారని మండిపాటు
  • మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని వ్యాఖ్య
  • ఇది అసమర్థ ప్రభుత్వమని తెలిసిపోయిందని విమర్శ
టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కనబడాలంటే.. చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. నిర్మల్ కాంగ్రెస్  సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తున్నామని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అందులో రాహుల్ గాంధీ ప్రసంగం వీడియో క్లిప్ ను కూడా జత చేశారు.

‘‘రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు రూ.2,500 చూపిస్తావా? మరీ ఇన్ని పచ్చి అబద్ధాలా? 

తెలంగాణలో ఉన్న కోటీ 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. 

వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని.. చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. 

కేసీఆర్ కిట్ ఆగింది. 
న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కల్యాణ‌లక్ష్మి నిలిచింది. 

తులం బంగారం అడ్రస్ లేదు. 

ఫ్రీ బస్సు కూడా ఓ బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి. 

అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు, నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ అందరికీ తెలిసిపోయింది’ అని ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు.


KTR
Revanth Reddy
Congress
BRS
Twitter

More Telugu News