జమ్మూకశ్మీర్‌లో ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ‘ఉగ్ర’దాడి!
- శనివారం సాయంత్రం పూంచ్ జిల్లాలో ఘటన
- కాన్వాయ్ వాయుసేన బేస్‌కు తిరిగొస్తుండగా ఏకే 47 తుపాకులతో విరుచుకుపడ్డ టెర్రరిస్టులు
- ఘటనలో ఒక సైనికుడి మృతి, ఐదుగురికి గాయాలు
- బాధితులకు ఉధంపూర్ కమాండ్ ఆసుపత్రిలో చికిత్స
మరోవైపు, ఘటన అనంతరం ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు ఘటన స్థలంలో ఉగ్రవాద ఏరివేత చర్యలు ప్రారంభించారు. భారీ ఎత్తున సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రియ రైఫిల్స్ కూడా ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటోంది. ఘటనపై స్పందించిన ఎయిర్‌ఫోర్సు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. దాడి అనంతరం టెర్రరిస్టులు సమీప అడవిలోకి పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు, గతేడాది డిసెంబర్ 21న పూంచ్ జిల్లాలోని బుఫ్లియాజ్ ప్రాంతంలో ఆకస్మిక దాడికి తెగబడ్డ బృందమే ఈ దాడిలోనూ పాలుపంచుకుని ఉంటుందని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ఆర్మీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.