RCB: ఆర్సీబీ బౌలింగ్ ధమాకా... స్వల్పస్కోరుకే కుప్పకూలిన గుజరాత్ టైటాన్స్

RCB bowlers bundled out Gujarat Titans for 147 runs
  • ఐపీఎల్ లో ఆర్సీబీ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • 19.3 ఓవర్లలో 147 పరుగులకే గుజరాత్ ఆలౌట్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సొంతగడ్డపై సత్తా చాటారు. గుజరాత్ టైటాన్స్ తో పోరులో సిరాజ్, యశ్ దయాళ్, విజయ్ కుమార్ వైశాఖ్ బంతితో సత్తా చాటారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. షారుఖ్ ఖాన్ 37, డేవిడ్ మిల్లర్ 30, రాహుల్ తెవాటి 35, రషీద్ ఖాన్ 18 పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ పేలవంగా ఆడింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, యశ్ దయాళ్ 2, విజయ్ కుమార్ వైశాఖ్ 2, కామెరాన్ గ్రీన్ 1, కర్ణ్ శర్మ వికెట్ తీశారు. 

అనంతరం, లక్ష్యఛేదనలో బెంగళూరు జట్టుకు ఫ్లయింగ్ స్టార్ట్ లభించింది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ జోడీ విరుచుకుపడడంతో స్కోరుబోర్డు వాయువేగంతో పరుగులు తీసింది. 

వీరిద్దరూ తొలి వికెట్ కు 5.5 ఓవర్లలో 92 పరుగులు జోడించి బెంగళూరు విజయానికి బాటలు వేశారు. డుప్లెసిస్ 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 64 పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లీ 12 బంతుల్లోనే 4 సిక్సులతో 28 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
RCB
GT
Chinnswamy Stadium
Bengaluru
IPL 2024

More Telugu News