BRS: బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన లోక భూమారెడ్డి

Loka Bhuma Reddy joins congress
  • విజయ డెయిరీ రాష్ట్ర చైర్మన్‌గా పని చేసిన లోక భూమారెడ్డి
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరిన భూమారెడ్డి
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
విజయ డెయిరీ రాష్ట్ర మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి బీఆర్ఎస్‌కు షాకిచ్చారు. ఆయన శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక భూమారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తొలి చైర్మన్‌గా పని చేశారు. ఆయన అయిదేళ్లపాటు ఈ పదవిలో పని చేశారు.
BRS
Congress
Telangana
Revanth Reddy

More Telugu News