Chimpanzee: నేనూ బైక్ పై వస్తా.. అడ్డగించి, అల్లరి చేసిన చింపాంజీ పిల్ల.. వైరల్ వీడియో ఇదిగో!

I too come on bike A chimpanzee doing mischief Here is the viral video
  • ఓ చోట పొలం వద్ద బైక్ పై కూర్చున్న వ్యక్తి
  • అక్కడికి వచ్చి బైక్ ఎక్కిన చింపాంజీ పిల్ల
  • వద్దని దింపేస్తే.. నానా అల్లరీ చేసి మళ్లీ ఎక్కిన తీరు
  • ‘ఎక్స్’లో వైరల్.. భలేగా ఉందంటూ నెటిజన్ల కామెంట్లు
ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే.. మేమూ వస్తామంటూ పిల్లలు అల్లరి చేయడం మామూలే. కొందరు గడుసు పిల్లలు అయితే వచ్చి బైక్ ఎక్కేసి కూర్చుంటారు కూడా. వారిని వద్దని దింపినా, అక్కడే ఉండి పట్టుబట్టడమో, ఏడవడమో చేస్తుంటారు. అచ్చం అలాగే చేసిన ఓ చింపాంజీ పిల్ల వీడియో ఒకటి విపరీతంగా వైరల్ గా మారింది.

బైక్ ఎక్కి.. దింపినా మళ్లీ వచ్చి..
  • ఊరవతల పొలంలో ఓ వ్యక్తి బైక్ పై బయలుదేరుతున్నాడు. అంతలో అక్కడికి ఓ చింపాంజీ పిల్ల వచ్చింది. మెల్లగా బైక్ దగ్గరికి వచ్చి.. ఎక్కేసింది. ఆ వ్యక్తిని వెనుక నుంచి పట్టుకుని కూర్చుంది. బైక్ పై ఉన్న వ్యక్తి దాన్ని మెల్లగా కిందికి దింపేశాడు. తాను బైక్ ను ముందుకు పోనిచ్చాడు.
  • అయినా పట్టువదలని చింపాంజీ పిల్ల అతడి బైక్ కు ఎదురువచ్చింది. తాను బైక్ ఎక్కుతానంటూ నానా అల్లరీ చేసింది. 
  • చివరికి అతడికి తప్పలేదు. రా.. బైక్ ఎక్కు అన్నట్టుగా సైగ చేయగానే.. చింపాంజీ పిల్ల ఉత్సాహంగా బైక్ ఎక్కేసింది. ఆ వ్యక్తిని పట్టుకుని కూర్చుంది.
  • కేవలం 21 సెకన్లు ఉన్న ఈ వీడియో ‘ఎక్స్’లో విపరీతంగా వైరల్ గా మారింది. కోటికి పైగా వ్యూస్, లక్షన్నర దాకా లైకులు వచ్చాయి.
  • ఆ చింపాంజీ పిల్ల చేష్టలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ‘చిన్న పిల్లల అల్లరి కంటే దారుణంగా ఉందంటూ’ కామెంట్లు వస్తున్నాయి.
Chimpanzee
offbeat
Viral Videos
Twitter

More Telugu News