Venkatesh Daggubati: మే 7న మా నాన్న ఖమ్మం వచ్చి ప్రచారం చేస్తారు: హీరో వెంకటేశ్ కూతురు ఆశ్రిత

Hero Venkatesh to campaign for the Khammam Congress candidate on May 7th
  • కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు వస్తున్నట్లు వెల్లడి
  • కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి
  • మే 13న హస్తం గుర్తుకు ఓటు వేసి రఘురాంరెడ్డిని పార్లమెంటుకు పంపిద్దామని పిలుపు
ప్రముఖ సినీ నటుడు హీరో వెంకటేశ్ ఈ నెల 7వ తేదీన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్నారని 'కాంగ్రెస్ ఫర్ తెలంగాణ' ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఈ మేరకు వెంకటేశ్ కూతురు ఆశ్రిత తన ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని చెబుతున్న వీడియోను ట్వీట్ చేసింది.

ఖమ్మం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రామసహాయం రఘురాం రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆశ్రిత మాట్లాడుతూ... రఘురాంరెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేందుకు తన తండ్రి (వెంకటేశ్) వస్తున్నారని తెలిపారు. మే 13న హస్తం గుర్తుకు ఓటు వేసి రఘురాం రెడ్డిని పార్లమెంట్‌కు పంపిద్దామని పిలుపునిచ్చారు.
Venkatesh Daggubati
Khammam District
Congress

More Telugu News