Viral Videos: బీజేపీకి ఓటేస్తానన్న మహిళ.. చెంపదెబ్బ కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి.. వీడియో ఇదిగో!

Telangana Congress Candidate Jeevan Reddy Slaps Woman During Campaign
  • ఆర్మూరు ప్రచారంలో ఉపాధి కూలిపై చేయిచేసుకున్న జీవన్‌రెడ్డి
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసినా పెన్షన్ రాలేదని మహిళ ఆవేదన
  • ఈసారి పువ్వు గుర్తుకే ఓటేస్తానని చెప్పడంతో చెంపపై కొట్టిన జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారంలో భాగంగా నిన్న ఓ మహిళకు చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మూరులో ఇతర నేతలతో కలిసి ప్రచారం నిర్వహించిన జీవన్‌రెడ్డి ఉపాధి కూలి పనులు చేస్తున్న మహిళను సమీపించి ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తావని ప్రశ్నించారు. ఆమె వెంటనే ‘పువ్వు’ గుర్తుకు అని చెప్పింది.

అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కే ఓటేశానని, కానీ పెన్షన్ రావడం లేదని, ఈసారి కమలం గుర్తుకే ఓటేస్తానని చెప్పింది. దీంతో జీవన్‌రెడ్డి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టి ఏదో చెప్పడం వీడియోలో కనిపించింది. ఆయన చెంపదెబ్బ వేయగానే మిగతా నేతలు ఒక్కసారిగా నవ్వారు. ఇప్పుడీ వీడియో  సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్ అయింది. కాగా, నిజామాబాద్‌లో జీవన్‌రెడ్డికి ప్రత్యర్థిగా సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నేత అరవింద్ బరిలో ఉన్నారు.
Viral Videos
Jeevan Reddy
Nizamabad District
Lok Sabha Polls
Congress

More Telugu News