MS Dhoni: 103 ఏళ్ల అభిమానికి ధోనీ స్పెష‌ల్ గిఫ్ట్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

MS Dhoni Gifts Signed CSK Jersey to 103 Year Old Fan S Ramdas
  • సీఎస్‌కే వీరాభిమాని ఎస్ రామ్‌దాస్ (103) కు జెర్సీని గిఫ్ట్‌గా పంపిన‌ మాజీ సార‌ధి 
  • 'థ్యాంక్స్ తాత ఫ‌ర్ స‌పోర్ట్' అనే సందేశాన్ని జెర్సీపై రాసిన ధోనీ
  • ఎంఎస్‌డీ త‌న‌కు పంపించిన ప్ర‌త్యేక బ‌హుమతిని చూసి మురిసిపోయిన రామ్‌దాస్
చెన్నై సూప‌ర్‌కింగ్స్ వీరాభిమాని అయిన ఎస్ రామ్‌దాస్ (103) కు ఆ జ‌ట్టు మాజీ సార‌ధి మ‌హేంద్ర సింగ్ ధోనీ ప్ర‌త్యేక బ‌హుమ‌తి పంపించారు. ఆయ‌న కోసం ప్ర‌త్యేకంగా త‌యారుచేసిన జెర్సీపై త‌న సంత‌కంతో పాటు ప్ర‌త్యేక సందేశం రాసి రామ్‌దాస్ త‌న‌యుడికి అంద‌జేశారు. 'థ్యాంక్స్ తాత ఫ‌ర్ స‌పోర్ట్' అనే సందేశాన్ని జెర్సీపై ధోనీ రాయ‌డం వీడియోలో ఉంది. 

ఇక ధోనీ పంపిన జెర్సీని చూసి పెద్దాయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట‌ర్) ఖాతా ద్వారా పంచుకోవ‌డంతో అది కాస్తా నెట్టింట వైర‌ల్ అవుతోంది. గ‌తంలోనూ జ‌ట్టుపై రామ్‌దాస్ అభిమానాన్ని సీఎస్‌కే త‌మ ట్విట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్న విష‌యం తెలిసిందే.
MS Dhoni
CSK Jersey
Cricket
Sports News

More Telugu News