Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా? వద్దా?: రేవంత్ రెడ్డి ప్రశ్న

Revanth Reddy asks telangana people to give return gift to bjp
  • పదేళ్లుగా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఢిల్లీ దర్బారుకు పన్నులు, జీఎస్టీ కట్టారన్న సీఎం
  • ఢిల్లీ దర్బారు తిరిగి తెలంగాణకు ఏమి ఇచ్చిందని ప్రశ్న
  • కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది కేవలం 'గాడిద గుడ్డు' మాత్రమేనని విమర్శ
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఢిల్లీ దర్బారుకు పన్నులు, జీఎస్టీ కట్టి కట్టి అలిసిపోయారన్నారు. మరి ఢిల్లీ దర్బారు తిరిగి తెలంగాణకు ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది కేవలం 'గాడిద గుడ్డు' మాత్రమేనని విమర్శించారు. మనకు గాడిద గుడ్డును ఇచ్చిన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా? వద్దా? అని ప్రశ్నించారు.
Revanth Reddy
Congress
BJP
Lok Sabha Polls

More Telugu News