Amit Shah: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

  • ఈ కేసులో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్
  • నిందితుడు సతీష్ తరఫున న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్
  • స్టే విధించిన తెలంగాణ హైకోర్టు
  • విచారణను నాలుగు వారాలు వాయిదా వేసిన హైకోర్టు
High Court stay on Amit Shah marphing video

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టు శుక్రవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.

నిందితుడు సతీష్ తరఫు న్యాయవాది ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కఠిన చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ప్రతి శుక్రవారం, సోమవారం విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు హైకోర్టు తదుపరి విచారణ చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News